ఎండాకాలంలో ఉదయాన్నే మట్టికుండలో నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇవి తాగడం వల్ల శరీరానికి మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ అందడంతో పాటు శరీరం ఎనర్జిటిక్‌గా ఉంటుంది. మట్టి కుండలో నిల్వ చేసిన నీళ్లు తాగటం వల్ల గ్యాస్, అసిడిటీ, శ్వాసకోశ సమస్యలు రావు. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.