బ్రెడ్ మీద ఫ్రూట్ జామ్ రాసుకుని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మార్కెట్లో దొరికే చాలా జామ్లలో పండ్ల శాతం కంటే పంచదార, కృత్రిమ రంగులే ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. వీటికి బదులుగా ప్రొటీన్ ఉండే పీనట్ బటర్ లేదా ఇంట్లో తాజాగా చేసుకున్న చట్నీలను వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.