కొంతమంది టీ తాగుతూ స్మోక్ చేస్తుంటారు. వీటి కలయిక ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ రక్తప్రవాహాన్ని పెంచగా.. సిగరెట్లు రక్తంలో ఆక్సిజన్‌ను నియంత్రిస్తాయి. అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. నికోటిన్ నాడీవ్యవస్థను ప్రేరేపించి, ప్రేగుల్లో కదలికలను పెంచుతుంది. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అనే వ్యాధి బారినపడతారు. జీర్ణ సమస్యలు వస్తాయి.
సోయాబీన్ గింజలే అనుకుంటే పొరపాటే.. అందులో అనేక పోషకాలు ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. రాత్రిపూట డిన్నర్లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండటంతో ఎముకలను బలంగా ఉంచుతాయి. వృద్ధాప్యంలోనూ ఎముకలు దృఢంగా ఉంటాయి. 100 గ్రాముల సోయాబిన్ తింటే 36 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. నాన్‌వెజ్ తినని వారికి సోయాబిన్ మంచి ఫుడ్ అని చెప్పవచ్చు.
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే బోలెడు లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు, దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
మనకున్న కొన్ని అలవాట్లు చర్మ సమస్యలను తెచ్చిపెడతాయని నిపుణులు అంటున్నారు. వివిధ పనుల కోసం రకరకాల వస్తువులను తాకి అదే చేతులతో ముఖాన్ని తాకుతుంటారు. మేకప్‌ని తొలగించుకోకపోవటం వల్ల కూడా చర్మం దెబ్బతింటుంది. ఫోన్ మాట్లాడేప్పుడు స్క్రీన్ ముఖానికి తాకేలా పెట్టుకోకూడదు. మాసిపోయిన దుప్పట్లు, పిల్లో కవర్ల వాడకం.. మొటిమల్ని పదేపదే తాకితే ముఖంపై బ్యాక్టీరియా వ్యాపిస్తుంది.
బియ్యం కడిగిన నీళ్లతో గ్లాసీ స్కిన్‌ను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బియ్యం కడిగిన నీళ్లను చర్మానికి పట్టించి కడగటం వల్ల కాంతివంతంగా మారుతుంది. ఈ నీళ్లను ఫేస్‌వాష్‌గా ఉపయోగిస్తే.. చర్మం తేమగా, హైడ్రేట్‌గా ఉంటుంది. ఎగ్జిమా, మొటిమలు, దద్దుర్లు వంటివి తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలను దూరం చేసి ముఖంపై యవ్వన ఛాయలను పెంచుతుంది.
శీతాకాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇంటి చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. హెన్నా పొడిలో నిమ్మరసం, పెరుగు వేసి తలకి పట్టించాలి. ఆరిన తర్వాత తక్కువ గాఢత ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. హెన్నా పొడిలో మందార ఆకులు, పువ్వుల పొడి.. ఉసిరి పొడి, మెంతి పొడి కలిపి వెంట్రుకలకు పట్టించాలి. ఈ ప్యాక్ వల్ల చుండ్రుతో పాటు జుట్టు రాలటం కూడా తగ్గుతుంది.
మారుతున్న జీవనశైలి వల్ల డిప్రెషన్ బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందులో సగానికి పైగా మహిళలే ఉంటున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అయితే డిప్రెషన్ తగ్గించటానికి నడకే మంచి మార్గమని పరిశోధకులు సూచిస్తున్నారు. రోజూ ఉదయం నడవటం వల్ల నిరాశ, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రక్తప్రసరణ మెరుగుపడి, నాడీవ్యవస్థ బలంగా మారుతుంది. సూర్యరశ్మిలో నడిస్తే నిద్ర సమస్యలు కూడా దూరమవుతాయి.
అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉసిరికాయలను తినొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొందరికి అసిడిటీ సమస్య, పొట్ట ఉబ్బరంగా కడుపులో మంటగా ఉంటుంది. అయితే విటమిన్ సి ఎక్కువగా ఉన్నందువల్ల ఈ సమస్యలు ఉన్నవారు ఉసిరికాయను తినకూడదు. తింటే ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు పరగడుపున అసలు తినొద్దు. అలాగే జ్యూస్ కూడా తాగకూడదు. రక్త సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా తినొద్దు.
1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.2. సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుంది.3. గుండె సమస్యలను దూరం చేస్తుంది.4. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.5. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది.6. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది.
చలికాలంలో ఆకుకూరలు తింటే అనేక లాభాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పాలకూర, గోంగూర, తోటకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. శరీరానికి పోషకాలు సైతం అందుతాయి. రక్తహీనతను తగ్గిస్తాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి.
ప్రతి మహిళ ఎదుర్కొనే సమస్యల్లో పీరియడ్స్ ఒకటి. అయితే కొన్నిసార్లు సరైన సమయంలో పీరియడ్స్ రావు. ఇలా అవ్వడానికి జీవన శైలిలో చేసే పొరపాట్లే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి కారణంగా ఈ సమస్య వస్తుంది. ఇది పీరియడ్స్ చక్రాన్ని నిర్వహించే హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం కూడా ఇందుకు కారణమట. ఐరన్, విటమిన్ డి లోపం వల్ల సరైన సమయంలో పీరియడ్స్ రావు.
ప్రస్తుత కాలంలో పిల్లలు తినేటప్పుడు ఫోన్ ఎక్కువగా చూస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఫోన్ చూస్తూ తినడం వల్ల పోషకాహార లోపంతో పాటు ఊబకాయ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జీర్ణక్రియ బలహీనపడుతుంది. కంటిపై ప్రభావం పడుతుంది. అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. పిల్లల పెరుగుదల, సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. మానసిక సమస్యలు తలెత్తుతాయి.
టిఫిన్ అనగానే చాలా మంది ఏదో ఒకటి తినేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ, బ్రేక్‌ఫాస్ట్‌లో పోషక విలువలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేవగానే మొదట తీసుకునే ఆహారంలో పీచు(fibre) అధికంగా ఉండేలా చూసుకోవాలి. పీచు తర్వాత తప్పనిసరిగా తీసుకోవాల్సినవి మాంసకృత్తులు. వీటితో పాటు శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి.
బొప్పాయి ఆకుల జ్యూస్‌తో చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నవారు ఈ జ్యూస్ తాగితే మంచిది. గ్యాస్, అల్సర్ వంటి సమస్యలు తగ్గుతాయి. మహిళల్లో రుతుక్రమ సమస్యలు దూరమవుతాయి. క్యాన్సర్, గుండె సమస్యలను ఇది నివారిస్తుంది.