TG: రాష్ట్రంలో HPV వ్యాక్సినేషన్ కాసేపట్లో ప్రారంభం కానుంది. 14 ఏళ్లు నిండిన బాలికలు ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అయితే భారత్‌లో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ అనేది రెండో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా ఉంది. ఈ క్యాన్సర్ ప్రధానంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ దీర్ఘకాలికంగా శరీరంలో ఉండటం వల్ల వస్తుంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం HPV వ్యాక్సిన్‌ను ఉపయోగిస్తోంది.