బార్లీ వాటర్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి చలవ చేసి ఎండదెబ్బ నుంచి కాపాడుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడమే కాకుండా, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇందులోని పీచు పదార్థం బరువు తగ్గడానికి, మలబద్ధకం దూరం చేయడానికి తోడ్పడుతుంది. అలాగే కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.