ఆకుకూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందులో పాలకూర అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆకుకూర. వారానికి ఒక్కసారైనా తింటే అనేక లాభాలు కలుగుతాయి. నీరసంగా అనిపిస్తే, పాలకూర తినాలి. కంటి చూపు మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు బలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యం, రక్తపోటును నియంత్రిస్తుంది. అయితే, పాలకూరను మరీ ఎక్కువగా ఉడికించొద్దు.