చర్మ సౌందర్యానికి శనగపిండి ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఔషధం. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, రంగును మెరుగుపరుస్తుంది. శనగపిండిలో పెరుగు కలిపి రాస్తే అధిక జిడ్డు తగ్గుతుంది. లేదా శనగపిండిలో చిటికెడు పసుపు, పాలు కలిపి ప్యాక్‌లా వేస్తే చర్మం మెరుస్తుంది. అంతేకాదు శనగపిండిలో నిమ్మరసంతో కలిపి వాడితే ట్యాన్ తొలగిపోతుంది.