డార్క్ చాక్లెట్లో ఉండే ఫ్లేవనాల్స్ నైట్రిక్ ఆక్సైడ్ విడుదలను ప్రేరేపించి రక్తనాళాలను సడలింపజేస్తాయి. దీని ద్వారా రక్తపోటు తగ్గుతుంది. కోకోలో ఉండే ప్రతి ఆక్సీకరణ పదార్థాలు రక్తనాళాల గోడలను, కొవ్వు అణువులను ఆక్సీకరణ నష్టానికి గురికాకుండా రక్షిస్తాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి.