గుంజీలు కేవలం వ్యాయామం మాత్రమే కాదు. కూర్చోవడం, నిలబడడం, మెట్లెక్కడం వంటి కదలికలకు మూలాధారం. నిత్యం గుంజీలు తీస్తే కాళ్ల బలం మూడురెట్లు పెరుగుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెరస్థాయిలు మెరుగుపడటంతో పాటు ఎముకల సాంధ్రత పెరుగుతుంది. 10 ఏళ్లపాటు నిర్వహించిన రెండు అధ్యాయాల్లో శక్తివంతమైన కాళ్లు కలిగినవారి మెదడు ఆరోగ్యకరంగా, చురుగ్గా ఉంటుందని తేలింది.