చాలామందికి జీతం పెరిగినప్పుడు దానికి తగ్గట్టే ఖర్చులు కూడా పెరిగిపోతుంటాయి. ఆర్థిక పరిభాషలో దీన్ని ‘లైఫ్ స్టైల్ క్రీప్’ అంటారు. అంటే మన ఆదాయం పెరిగే కొద్దీ, మనకు తెలియకుండానే మన జీవనశైలి ఖరీదైనదిగా మారిపోతుంది. పెరిగిన ఆదాయంతో ఖరీదైన ఫోన్లు, విలాసవంతమైన వస్తువుల మీద మొగ్గు చూపుతారు. ఈ అలవాట్లే క్రమంగా అవసరాలుగా మారి, పొదుపును అడ్డుకుంటాయి.