‘ఓ రాజా!.. క్షమ ఒక్కటే పరమ ధర్మం, శాంతికి మించిన సుఖం లేదు, విద్యే నిజమైన తృప్తి, అహింస ఒక్కటే ఆనందం. ఈ నాలుగింటిని కలిగిన వాడు ఇహపరలోకాల్లో శాంతిని పొందుతాడు. తనని తాను నిగ్రహించుకునేవాడు మాత్రమే ఇతరులను నడిపించగలడు. కోపాన్ని, అహంకారాన్ని వదిలి ధర్మ మార్గంలో నడవడమే మనిషికి అసలైన రక్షణ’ అని ధృతరాష్ట్రునికి విదురుడు బోధించారు.