పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించేందుకు నౌకాసనం ఉత్తమమైనది. నేలపై వెల్లకిలా పడుకుని గాలి పీలుస్తూ కాళ్లు, ఛాతి భాగాన్ని ఒకేసారి గాలిలోకి లేపి చేతులను మోకాళ్లకు సమాంతరంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల పొట్ట కండరాలపై తీవ్రమైన ఒత్తిడి కలిగి అక్కడ పేరుకున్న కొవ్వు కరుగుతుంది. ఇది బరువు తగ్గించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, వెన్నెముకను దృఢంగా మార్చడంలో కూడా తోడ్పడుతుంది.