చలికాలంలో వచ్చే పలు అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు కొన్ని ఆహారపదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలని పోషకార నిపుణులు చెబుతున్నారు. చెరుకు రసం, రేగుపండ్లు, చింతపండు, ఉసిరి, నువ్వులు, ఖర్జూరాలు, చిరుధాన్యాలు తీసుకోవాలి. వీటిలోని పోషకాలు కాలేయ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఎముకలు, కీళ్లు బలంగా ఉండేలా చేస్తాయి. ఇన్ఫెక్షన్లు దరిచేరవు. శరీరానికి వెచ్చదనం అందుతుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది.
పని ఒత్తిడి, రాత్రిళ్లు సరిగా నిద్రపట్టకపోవటం వంటి పలు సమస్యల కారణంగా తలనొప్పి వేధిస్తుంటుంది. ఈ సమస్య పరిష్కారానికి కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అల్లం, నిమ్మరసం సమపాళ్లలో కలిపి రోజులో రెండుసార్లు తీసుకోవాలి. నుదుటిపై రోజ్‌మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని చర్మం లోపలికి ఇంకేటట్లు మర్దన చేయాలి. తులసి ఆకులు వేసి మరిగించిన నీరు తాగాలి. ఐస్ ప్యాక్ పెట్టుకున్న...
KMR: సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి MPPS స్కూల్‌లో నేడు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు ప్రభుత్వ ఆసుపత్రి నేత్ర వైద్య సహాయ అధికారి హరికిషన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో RBSK డాక్టర్ మారుతి, HM బిల్యానాయక్ పాల్గొన్నారు.
చలికాలంలో శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోయి సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. వాటి నుంచి బయటపడాలంటే రోగనిరోధకశక్తిని పెంచుకోవటం ముఖ్యం. ఇందుకోసం ఉసిరి టీ చక్కగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చెంచా ఉసిరి పొడి, కొద్దిగా అల్లం, రెండు తులసి ఆకులు, చిటికెడు జీలకర్ర పొడి వేసి మరిగించి తాగాలి. లేదా తాజా ఉసిరికాయ గుజ్జుని నీళ్లలో మరిగించి కూడా తాగొచ్చు. ఇలా చేస్తే బీపీ, షుగర్ నియంత్రణలో ఉంటాయి. శ్వా...
మగవారు గడ్డం పెంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గడ్డం ఉండటం వల్ల హానికరమైన యూవీ కిరణాల నుంచి ముఖం కవర్ అవుతుంది. దీని వల్ల చర్మ క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. చర్మం తేమగా ఉండటం కారణంగా మొహంపై పగుళ్లు, మొటిమలు వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. గాలిలో ఉండే బ్యాక్తీరియా త్వరగా నోటిలోకి చేరకుండా అడ్డుకుంటుంది. గడ్డం వల్ల స్కిన్ ట్యాన్ అవ్వదు, పొడి చర్మం సమస్య నుంచి బయ...
చాలా మంది బరువు తగ్గడానికి ఆహారపు అలవాట్లు, కష్టమైన వ్యాయామాలు చేస్తుంటారు. కానీ, తేలికగా 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే ఎన్నో లాభాలు ఉంటాయని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. స్కిప్పింగ్ చేయడం వల్ల హృదయ కండరాలు, ఊపిరితిత్తులు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో క్యాలరీలు బర్న్ అయ్యి.. భుజాలు, పొట్ట, కండరాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. నిత్యం స్కిప్పింగ్ చేస్తే గుండె సమస్యలకు...
ప్రపంచస్థాయిలో ఏటా ప్రజలు ఇష్టంగా తినే ఆహార పదార్థాల వివరాలు సేకరించి, వాటి జాబితాను టెస్ట్ అట్లాస్ అనే సంస్థ విడుదల చేస్తోంది. ఈ జాబితాలో తమిళనాడులో తయారవుతున్న చికెన్ 65 మూడో స్థానంలో నిలించింది. కాగా, 1960లో తమిళనాడులో బుఖారీ అనే ఆహార సంస్థ ఈ చికెన్ 65 తయారీ ప్రారంభించినట్లు సమాచారం. ఈ జాబితాలో చైనాకు చెందిన క్రిస్పీ ఫ్రైడ్ చికెన్, తైవాన్‌కు చెందిన బాంబకాన్ చికెన్ తదితరాలు కూడా చోటుచేసు...
మారుతున్న జీవనశైలి, కాలుష్యం, ఒత్తిడి వంటి కారణాలతో జుట్టు రాలిపోవటం పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. గుడ్డు తెల్లసొనను కుదుళ్లకు పట్టించి ఆరిన తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఉల్లిరసం లేదా కలబంద గుజ్జు అప్లై చేసుకోవాలి. ఆముదం, కొబ్బరినూనె కలిపి కాస్త వేడి చేసి జుట్టుకి పట్టించాలి. తరచూ ఇలా చేస్తే వెంట్రుకలు ఒత్తుగా, బలం...
స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల వాడకంతో స్క్రీన్ టైమ్ పెరిగి కళ్లు పొడిబారటం, దురద, కళ్లు ఎర్రబడటం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. 20 నిమిషాల పాటు స్క్రీన్ వాడితే 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించాలి. ఇది కళ్లకు మంచి వ్యాయామం. కీర ముక్కలని కళ్లపై పెట్టుకోవాలి. గోరువెచ్చని నీటితో కళ్లపై కాపడం పెట్...
నిత్యం ఆహారంలో బెండకాయను భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే బెండకాయ తింటే ఆ ప్రయోజనం పొందవచ్చు. 100 గ్రాముల బెండకాయల ద్వారా సుమారు 33 క్యాలరీల శక్తి లభిస్తుంది. బెండకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు ఉన్నా.. ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో అధికంగా ఆహారం తీసుకోరు. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
ఆడవాళ్లు ధరించే దుస్తువుల్లో ఎన్ని రకాలున్నా చీరకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఎంత ఖరీదు పెట్టి కొన్నా.. ఎంత నాణ్యమైన చీర అయినా అందంగా కనిపించాలంటే కొన్ని టిప్స్ పాటించాలని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. చీరకట్టు అందగా ఉండేందుకు ఎంపిక చేసుకునే పెట్టికోట్ కీలకం. తేలికైన చీరలకు బరువుగా ఉండేవి.. బరువైన చీరలకు తేలికగా ఉండే పెట్టికోట్ ఎంచుకోవాలి. నెట్ శారీకి సాటిన్, షిమ్మర్ రకం బెటర్. కొత్త చీరలక...
సాధారణంగా వంటల్లో నూనెలు వాడుతుంటాం. అయితే కొన్ని రకాల ఆయిల్స్ చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. పల్లీ నూనెలోని విటమిన్-ఇ చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయదు. ఆలివ్ ఆయిల్‌తో మర్దనా చేసుకుంటే చర్మం మెరుస్తుంది. ఆవనూనె.. నిర్జీవమైన చర్మానికి స్వాంతన చేకూరుస్తుంది. కొబ్బరి నూనెలోని పోషకాలు పొడిబారిన చర్మాన్ని మృదువుగా, తాజాగా మారుస్తాయి.
చలికాలంలో జుట్టు ఎక్కువగా రాలటంతో పాటు చుండ్రు సమస్య కూడా ఎదురవుతుంది. కొన్ని హెయిర్ ప్యాక్స్‌తో కురులను సంరక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పావుకప్పు ఉల్లిరసానికి 2 చెంచాల కొబ్బరినూనె కలిపి తలకి పట్టించాలి. ఉసిరి పొడి, పెరుగు లేదా కలబంద గుజ్జు, నిమ్మరసం కలిపి తలకి రాసుకోవాలి. వారానికి రెండుసార్లైనా ఈ ప్యాక్స్ వేసుకుంటే చుండ్రు దరిచేరదు. తలపై దురద తగ్గుతుంది. వెంట్రుకలు మృదువుగా, బ...
శీతాకాలంలో చలి కారణంగా, దోమల బెడద వల్ల కొంతమంది దుప్పటిని నిండుగా కప్పుకుని నిద్రపోతుంటారు. అయితే ముఖం పైవరకు దుప్పటి కప్పేసి పడుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. అలా చేయటం వల్ల మనం వదిలే కార్బన్‌డైయాక్సైడ్‌ని మళ్లీ పీలుస్తాం. కాబట్టి శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీంతో రక్తప్రసరణ సరిగా జరగదు. తలనొప్పి, వికారం, అలర్జీ, హృద్రోగ సమస్యలు వస్తాయి. మెదడు, రక్తనా...
పచ్చి పాలు చర్మానికి పోషణనిచ్చి ఆరోగ్యంగా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చి పాలతో ఫేషియల్ చేయడం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. చర్మ రంధాలను శుభ్రపర్చడంలో సహాయపడుతాయి. చర్మం మెరుస్తూ, మృదువుగా మార్చుతాయి. అలాగే, మచ్చలను తగ్గిస్తాయి. చర్మాన్ని హైడ్రేట్, పొడిబారకుండా చేస్తాయి. చర్మానికి యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను అందిస్తాయి. ముడుతలు, ఫైన్ లైన్లను, మొటిమలను నివారిస్తాయి.