ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వ్యసనం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్ షిప్ రిసెషన్ ఏర్పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో వందలాదిగా ఉన్న స్నేహితులు నేడు ఒక్కరికి పరిమితమయ్యారు. దేశంలో 15% మందికి అసలు స్నేహితులే లేకపోవడం ఆందోళనకరం. ఈ ఒంటరితనం తీవ్రమైన డిప్రెషన్‌కు దారితీస్తోంది. సోషల్ మీడియాలో కాకుండా నిజజీవితంలో స్నేహాలను పెంచుకోవడం మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం.