KMR:బాన్సువాడ మండలం, హన్మాజీపేట్ గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీ సిబ్బంది మొక్కజొన్న తూకంలో క్వింటాల్‌కు 3 నుంచి 4 కిలోలు తూకంలో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తా రోకో నిర్వహించారు. తూకం తనిఖీ చేసేందుకు అధికారులను పిలిచి నిర్ధారణ చేసి సిబ్బంది పై చర్యలు తీసుకుంటామని ఆర్డీవో రవీందర్ రెడ్డి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.