AKP: హోంమంత్రి వంగలపూడి అనిత కృషి ఫలితంగా నక్కపల్లికి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు మంజూరైనట్లు టీడీపీ నియోజకవర్గం కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ బుధవారం తెలిపారు. కోర్టును ప్రారంభించడానికి అవసరమైన భవనాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రజలు కోర్టు పనులపై ఎలమంచిలి వెళ్లాల్సి వచ్చేదన్నారు.