VZM: బొండపల్లి పోలీసు స్టేషను పరిధిలోని పలు గ్రామాలలో మహిళల చట్టాలపై ఎస్సై యు.మహేష్ బుధవారం అవగాహన కల్పించారు. గ్రామాల్లో బెట్టింగ్ పాల్పడితే పోలీస్ స్టేషనుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళలపై లైంగిక దాడులు ఎదుర్కొనేందుకు శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.