NGKL: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ గ్రామాల పునరావాస ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో గృహాలు, రహదారులు, తాగునీరు, విద్యా, ఆరోగ్య సదుపాయాలను వెంటనే కల్పించాలన్నారు. 30 రోజుల్లోగా భూ పట్టాల పంపిణీ పూర్తి చేసి, తొలి విడత నష్టపరిహారాన్ని పారదర్శకంగా అందజేస్తామన్నారు.