TG: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వర క్షేత్రంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ అంత్య పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎండల దృష్ట్యా ఘాట్ల వద్ద, క్యూ లైన్లలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, నిరంతరం మజ్జిగ, తాగునీరు, మెడికల్ క్యాంపులు, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.