KNR: శంకరపట్నం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించి రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ నాయకులు తహసీల్దార్ సురేఖకు వినతిపత్రం అందజేశారు. తాలు, తరుగు, బి- కేటగిరి పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వర్ష సూచనల నేపథ్యంలో టార్పాలిన్లు, అదనపు లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని మిల్లుకు తరలించాలి.