AP: కువైట్లో చిక్కుకున్న చంద్రగిరి మహిళకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బాధితురాలిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో కువైట్లోని భారత రాయబార కార్యాలయంతో సీఎంవో సంప్రదింపులు జరిపారు. బాధితురాలి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ స్వదేశశానికి రప్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.