ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘డ్రాగన్’ చిత్ర యూనిట్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ రికార్డులు సృష్టిస్తుండగా, తాజాగా మరో పవర్ఫుల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్టైలిష్ బూట్‌కట్ ట్రౌజర్స్‌లో చేతిలో పదునైన ఆయుధంతో ఎన్టీఆర్ యాక్షన్ ప్యాక్డ్ లుక్ నెట్టింట సెగలు పుట్టిస్తోంది.