AP: పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి సైకిల్ తొక్కి అందరినీ ఉత్సహపరిచారు. తల్లికి వందనం ద్వారా విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా ఇస్తున్నామని తెలిపారు. అభివృద్ధికి మరో 15 ఏళ్లు కొనసాగాలంటే కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని అన్నారు.