NLG: నార్కెట్ పల్లిలో బుధవారం హైదరాబాద్ నార్కోటిక్ బ్యూరో ప్రత్యేక శునకంతో పోలీసులు గంజాయి తనిఖీలు చేపట్టారు. నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు బస్టాండ్, పాన్ షాపులు, యువత సంచరించే ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. ప్రజలు గంజాయి అమ్మకం, సేవించే వారి సమాచారం ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ తెలిపారు.