WNP: ఈనెల 22న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్యా నాయక్ ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.