BHNG: బీబీనగర్ మండల కేంద్రంలో ఇరుకు రోడ్ల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పోచంపల్లి రోడ్డు చౌరస్తా వద్ద భారీ వాహనాలు వచ్చే సమయంలో నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రయాణికులు గంటల తరబడి నరకం చూస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇరుకు రోడ్ల విస్తరణ చేపట్టి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు.