JGL: ధర్మపురి మండలం బోదరి నక్కల చెరువు గూడెంకు చెందిన రమ్య(21) మానసిక ఆందోళనతో మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కొంతకాలంగా ఆమె ఒంటరిగా ఉంటూ మానసికంగా బాధపడుతున్నట్లు తెలిపారు. తండ్రి మారినేని లచ్చన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై జీ. మహేశ్ వెల్లడించారు.