CTR: పలమనేరులోని ఓ కార్పొరేట్ పాఠశాల వద్ద ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం మొదలు కాకుండానే నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు. అధికారులు కార్పొరేట్ పాఠశాలలకు వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పట్టించుకోవడం లేదన్నారు.