కృష్ణా: జిల్లా స్థాయి SAAP లీగ్ 2026 వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియం ఇండోర్ హాల్లో బుధవారం విజయవంతంగా జరిగాయి. ఈ పోటీల్లో మొత్తం 36 మంది వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులు పాల్గొని, తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు స్టేడియం కమిటీ వైస్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.