MDCL: మేడ్చల్ మండలం రైతులకు జిల్లా అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. మేడ్చల్, డబీల్పూర్ ప్రాంతాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరిసర గ్రామాల రైతులు వారు పండించిన వరి ధాన్యం, ఆయా కేంద్రాలకు తీసుకువస్తే ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.