రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్కు భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఫిదా అయ్యాడు. ఐపీఎల్లో వైభవ్ ఆడుతున్న తీరు అద్భుతమని కొనియాడిన యువీ.. భవిష్యత్తు స్టార్ అయిన అతడిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోవద్దని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి సూచించాడు.