NLR: రాపూరు మండలం గోనుపల్లిలో “పల్లె వీక్షణ” కార్యక్రమం గురువారం జరగనుంది. కలెక్టర్ హిమాన్షు శుక్లా వస్తారు. ఉపాధి హామీ పనులు, అంగన్వాడీ కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు సేవా కేంద్రం, జలజీవన్ మిషన్ ట్యాంక్ తదితర అభివృద్ధి కార్యక్రమాలను అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకుని వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.