AP: బెంగళూరులో జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల కారణంగా దేశం ఇబ్బందుల్లో ఉంది. ఎంత కష్టకాలమైనా ఎదుర్కొనే గొప్ప నేత మోదీ ప్రధానిగా ఉన్నారు. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ప్రశాంతత లేకుంటే ఉపయోగం ఉండదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఏపీకి తన సేవలు అందించాలి’ అని కోరారు.