ASR: అరకులోయ మండలం సుంకరిమెట్ట పంచాయాతీలో బుధవారం స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు పంచాయితీ పరిదిలోని కాఫీ ట్రైల్ నుండి సుంకరిమెట్ట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వరకు రోడ్డుకు ఇరువైపుల చెత్త ప్లాస్టిక్ ఏరివేశారు. పర్యాటకులు చెత్తను, ప్లాస్టిక్ ను ఎక్కడిపడితే అక్కడ వేయవద్దని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఎంపీడీవో ప్రసాద్ అన్నారు.