PDPL: రామగుండం పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందంతో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. CI కృష్ణ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మజీద్ టర్నింగ్, స్మోకింగ్ జోన్లు, పాన్ షాపులు, ప్రజలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో సోదాలు చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.