ASR: డుంబ్రిగూడ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ శ్రీ పూజ హాజరయ్యారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు తమ సమస్యలపై వినతిపత్రాలు అధికారులకు సమర్పించారు. మొత్తం 70 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.