SRD: సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో బుధవారం జరిగిన బడిబాట కార్యక్రమంలో MEO శంకర్ మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, ఉచిత యూనిఫామ్, పాఠ్యపుస్తకాలతో పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని తెలిపారు.