జగిత్యాల మండలంలోని వెల్దుర్తి అనుబంధ గ్రామమైన గొల్లపల్లిలో మహంకాళి బోనాలతో పాటు పట్నాలు కార్యక్రమాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గొల్ల, కురుమ సంఘం, గ్రామ ఐక్యతను చాటడం పండుగ ప్రాముఖ్యత అని అన్నారు. సర్పంచ్ ప్రకాశ్, ఉప సర్పంచ్ తిరుపతి, కౌన్సిలర్ చెట్టె గంగాధర్ ఉన్నారు.