శరీరంలోని అధిక వేడిని తగ్గించడానికి బార్లీ ఒక అద్భుతమైన సహజ పానీయం. ఇది శరీరాన్ని చల్లబరిచి, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. డీహైడ్రేషన్, అజీర్తి, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్ర సంబంధిత సమస్యలను నివారిస్తుంది. బార్లీ నీరు కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించడమే కాకుండా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. విటమిన్లు, ఖనిజాలతో నిండిన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.