WGL: యుద్ధం కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోడిగుడ్ల నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. సుమారు 70 లక్షల కోళ్లు ఉండగా రోజుకు 50 నుంచి 60 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. గల్ఫ్ దేశాలకు భారీ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. కేవలం 20 శాతం గుడ్లు మాత్రమే స్థానిక మార్కెట్కు చేరుతుండటంతో మిగిలిన నిల్వలన్నీ షెడ్లలో ట్రేలలో పేరుకుపోతున్నాయి.