అన్నమయ్య: మదనపల్లె MRO కిషోర్ కుమార్ రెడ్డిపై అక్రమ వసూళ్లు, ఆలస్యం ఆరోపణలు రావడంతో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఆయనను బదిలీ చేశారు. మ్యుటేషన్ కోసం వచ్చిన వ్యక్తుల నుంచి రూ.లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. బాధితులు CCLA కలెక్టర్కు ఫిర్యాదు చేయగా విజిలెన్స్ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.