నంద్యాల జిల్లాలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని ఇవాళ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు ఎర్రిస్వామి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం వారు రేకుల షెడ్లలో విద్యార్థులకు చదువు చెప్పి అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు.