WGL: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా భద్రతపై రూపొందించిన గోడ పత్రికలను మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్ ఆవిష్కరించారు. మహిళల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని సీపీ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ దార కవిత, అదనపు డీసీపీ రవి, తదితరులు పాల్గొన్నారు.