CTR: నిండ్ర మండలంలో భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, నష్ట తీవ్రతను బట్టి పలువురు బాధితులకు రూ. 4 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు పరిహారాన్ని అందజేశారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.