BDK: మణుగూరు సింగరేణి ఓ కంపెనీ ఆధ్వర్యంలో ఆదివారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి చేసి ఉత్పాదకతను పెంచాలని సూచించారు. సంస్థ అభివృద్ధికి అందరూ సమన్వయంతో పని చేయాలని ఆయన కోరారు.