NZB: ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ప్రధాన రహదారుల గుండా అక్రమ షెడ్ల నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, ట్రేడ్ లైసెన్సులు చెల్లించకుండా సదరు వ్యక్తులు ఇష్టారీతిగా షెడ్లను నిర్మించుకుంటూ అక్రమ పద్ధతిలో వ్యాపారాలు చేస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు.