MNCL: బెల్లంపల్లి మండలం తాళ్లగురజాల పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీలలో భాగంగా రామగుండం CP అంబర్ కిషోర్ ఝా మంగళవారం సందర్శించారు. స్టేషన్ రికార్డులు, నేరస్తుల వివరాలు, పెండింగ్ కేసుల రిజిస్టర్లను తనిఖీ చేశారు. పెండింగ్ కేసులను వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.