BDK: స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన దేశానికి చేసిన సేవలు అపారమని కొనియాడారు.