TG: మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ప్రస్తుతం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. మూసీ అభివృద్ధికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని, అసలు ఈ ప్రక్షాళన పనులు బీఆర్ఎస్ హయాంలోనే ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. తమ పాలనలో పునర్నిర్మాణం పేరుతో ఒక్క నిర్మాణాన్ని కూడా కూలగొట్టలేదని, ప్రస్తుత ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన విమర్శించారు.