TG: రాష్ట్ర RTC ఉద్యోగులకు యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ స్కీం కింద ఉద్యోగులు, అధికారులకు ఇచ్చే స్పెషల్ ఇంక్రిమెంట్‌ను నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు లేదా వారి భాగస్వాములు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా ఈ అదనపు ప్రయోజనం లభించదు. RTC బోర్డు తీర్మానం మేరకే ఈ మార్పు చేసినట్లు సంస్థ స్పష్టం చేసింది.